సికింద్రాబాద్ (జనం సాక్షి ): బన్సీలాల్ పేట్ డివిజన్ గొల్ల కొమ్మరయ్య కాలనీ లొ టిఆర్ఎస్వి డివిజన్ అధ్యక్షుడు మనీశ్ అద్వర్యం లో గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మొదటిరోజు పూజను ఘనంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం మా మిత్రులు అనిష్ , క్రాంతి, అభిలాష్ , భరత్, ఉదయ్, వినీత్, ఆకాష్ , నిరంజన్ అందరం కలిసి రంగ రంగ వైభవంగా గణపతి మహా రాజ్ నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు . గొల్ల కొమరయ్య కాలనీలోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ గణపతి మహరాజ్ను వేడుకున్నట్టు వెల్లడించారు . అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంచిపెట్టారు .
గణపతి పూజలో పాల్గొన్న టిఆర్ఎస్వి నాయకులు..




