గణేష్ విగ్రహాల మండపాలకు ఆన్లైన్ లో అనుమతి తప్పనిసరి: ఎస్సై డి.సుధాకర్

జనంసాక్షి / చిగురుమామిడి – సెప్టెంబర్ 2:
మండలంలోని గణేష్ మండపాలను ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని గత వారం రోజులుగా చెబుతున్నప్పటికీ ఇప్పటికీ కేవలం 78 మంది మాత్రమే ఆన్లైన్లో నమోదు చేసుకోవడం జరిగిందని
ఇంకా మన మండలంలో 81 మంది ఆన్లైన్లో నమోదు చేసుకోవాల్సి ఉందని ఎస్సై సుధాకర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
మండపాల నిర్వాహకులు ఆన్లైన్లో నమోదు చేసినట్లయితే అన్ని మండపాలని జియో టాగింగ్ చేసి సంపూర్ణ రక్షణ కల్పించడానికి అవకాశం ఉంటుంది. ఈ రోజు తప్పకుండా మీరు ఆన్లైన్ లో నమోదు చేసుకున్నట్లయితే వారికి ఉన్నటువంటి అన్ని అనుమతులు ఇవ్వబడును.
లేనిచో అనుమతి ఇవ్వడం జరగదు.కాబట్టి ఇప్పటికైనా ప్రతి ఒక్కరూ మీయొక్క మండపాన్ని ఆన్లైన్లో నమోదు చేసుకోవాల్సిందిగా కోరారు.
ఆన్లైన్ నమోదు చేయడంలో మీకు ఏమైనా సందేహాలు ఉంటే పోలీస్ స్టేషన్లో గాని,
మీ దగ్గరలో ఉన్న ఆన్లైన్ మీ-సేవ సెంటర్ ని గాని
సంప్రదించాల్సిందిగా ఎస్సై
డి. సుధాకర్ తెలిపారు.