గర్భిణీలు సరైన పౌష్టికాహారం తీసుకోవాలి: అంగన్వాడి టీచర్ పోకల వెంకమ్మ
గరిడేపల్లి, సెప్టెంబర్ 22 (జనం సాక్షి): గర్భిణీలు బాలింతలు సరైన పౌష్టికాహారం తీసుకోవాలని అంగన్వాడీ టీచర్ పోకల వెంకమ్మ అన్నారు. గురువారం పోషణ మాసోత్సవాల సందర్బంగా మండలంలోని గానుగబండ గ్రామంలో కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ గర్భిణీలు బాలింతలు పోషక విలువలు వున్న ఆహారం తీసుకుంటే పుట్టబోయే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలు వున్నా ఆహారాన్ని తీసుకోవాలన్నారు.ఈ సందర్బంగా గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమం లో అంగన్వాడీ టీచర్లు అమరావరపు సత్యవతి, జంగం అనిత, గర్భిణీ, బాలింతలు పిల్లలు పాల్గొన్నారు.