Wednesday, 4 November 2026

గాంధీ జయంతికి దుస్తులు పంపిణీ చేసిన కార్పొరేటర్

అల్వాల్ (జనంసాక్షి) అక్టోబర్ 2
అల్వాల్ సర్కిల్ వెంకటపురం డివిజన్ బొరని కమ్యూనిటీ హాల్లో మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా స్థానిక కార్పొరేటర్ సబితా అనిల్ కిషోర్ మహాత్మా గాంధీకి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ బాపూజీ కలలు కన్న సంపూర్ణ గ్రామ స్వరాజ్యం దిశగా టిఆర్ఎస్ ప్రభుత్వ పాలన సాగుతుందని కొనియాడారు. గాంధీ ఆశయాలకు ఆచరణీయం కావలసిన అవసరం ఎంతో ఉందన్నారు. అనంతరం జిహెచ్ఎంసి శానిటేషన్ సిబ్బందికి దుస్తులను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు షేక్ అమర్, షబీర్, టిఆర్ఎస్ పార్టీ స్థానిక నాయకులు ప్రభాకర్, జమందర్, షేక్ షబ్బీర్, కుట్టి, జనార్ధన్, రమ, శివ, రాజు, శంకర్, శ్రీనివాస్, చంద్రశేఖర్, లింగం, అమృత, స్వప్న, తదితరులు పాల్గొన్నారు.