దుబ్బాక సిఐ పరుశురాం
మిరుదొడ్డి,అక్టోబర్ 15(జనంసాక్షి)
ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని దుబ్బాక సిఐ పరుశురాం హెచ్చరించారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి లోని జడ్.పి.హెచ్.ఎస్ పాఠశాలలో ఏర్పాటు చేయనున్న పోలింగ్ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాతూ,పోలింగ్ స్టేషన్ల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. ఎన్నికల దృశ్య గామాల్లో అనుమానిత వ్యక్తుల ఉంటే తమకు సమాచారం అందించాలన్నారు. దుబ్బాక సర్కిల్ పరిధిలోని 112 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని, అందులో 25 పోలింగ్ కేంద్రాల్లో సమస్యాత్మక గ్రామాలుగా గుర్తించడం జరిగిందన్నారు. అలాగే 13 అత్యంత సమస్యాత్మకంగా గుర్తించడం జరిగిందన్నారు. ఆయన వెంట మిరుదొడ్డి ఎస్సై విజయ భాస్కర్ తదితరులున్నారు.
గామాల్లో అనుమానిత వ్యక్తులు కన్పిస్తే పోలిసులకు సమాచారం అందించాలి




