Wednesday, 4 November 2026

గుండాల బహిరంగ సభను జయప్రదం చేయండి — –బోడు లో కళా కారులతో ప్రదర్శన

టేకులపల్లి, అక్టోబర్ 13 (జనం సాక్షి): అడవి సంరక్షణ నియమాల సవరణలకు వ్యతిరేఖంగా అఖిలభారత రైతుకూలి సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈనెల14 న గుండాల మండల కేంద్రంలో జరిగే భహిరంగ సభను జయప్రదం చేయాలని కోరుతూ టేకులపల్లి మండలం బోడు గ్రామంలో అరుణోదయ కళాకారులు డప్పు, నృత్యాలతో కళా ప్రదర్శన నిర్వహించారు. అనంతరం న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఆవునూరి మధు,టేకులపల్లి మండల కార్యదర్శి కల్తి వెంకటేశ్వర్లు, అఖిలభారత రైతు కూలి సంఘం జిల్లా నాయకులు ఎట్టిన ర్సింహారావు,అరుణోదయ జిల్లా కార్యదర్శి చిరంజీవి, ఇఫ్టు జిల్లా ప్రధాన కార్యదర్శి కొక్కు సారంగపాణి లు మాట్లాడారు. ఈకార్యక్రమంలో పి.డి.యస్.యు రాష్ట నాయకులు శ్యామ్,మస్తాన్, అరుణోదయ ఖమ్మం జిల్లా కార్యదర్శి శ్రీకాంత్ కన్నా కళాకారులు పాల్గొన్నారు.