గుడుంబా తయారీదారులపై బైండోవర్ కేసులు
గుడుంబా విక్రయిస్తే కఠిన చర్యలు:గూడూరు ఎక్సైజ్ సిఐ బిక్షపతి
కొత్తగూడ అక్టోబర్ 14 జనంసాక్షి:మహబూబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని దుర్గారం,పోగుల్లపల్లి గ్రామాలలో నాటుసార అమ్మకం దారులపై ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు.ఈ దాడుల్లో ఏడు లీటర్ల నాటు సారాయిని స్వాధీనం చేసుకుని నలుగురు ముద్దాయిలు బోడ హేమ్ల,హర కావత్ శాంత,గట్టి భద్రమ్మ,గట్టు లలిత లను స్థానిక కొత్తగూడ తహసిల్దార్ ముందు బైండోవర్ చేయడం జరిగిందని ఎక్సైజ్ బిక్షపతి తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ కానిస్టేబుల్ బుచ్చయ్య,వెంకన్న,సుధాకర్ పాల్గొన్నారు.