ప్రైవేట్‌ను వీడి వస్తోన్న విద్యార్థులు
హైదరాబాద్,జూలై14(జనం సాక్షి): తెలంగాణలో గురుకులాల ఏర్పాటుతో ప్రైవేట్ రంగంలో చదువుతున్న విద్యార్థులు ఇందులో చేరుతున్నారు. గురుకులాల్లో వసతులు పెరగడంతో పాటు పైసా ఖర్చు లేకపోవడంతో తల్లిదండ్రులు తమ పిల్లలను ఇక్కడ చేర్పించేందుకు మొగ్గు చూపుతున్నారు. అనేక జిల్లాల్లోని ప్రైవేటు పాఠశాలల్లో శిక్షణ, అనుభవం లేని ఉపాధ్యాయుల తోనే నెట్టుకొస్తున్నారని విద్యాశాఖ నిర్వహించిన సర్వేలో తేలింది. కొన్ని పాఠశాలలు కేవలం పై మెరుగుల తో విద్యార్థులను ఆకట్టుకుంటున్నాయి. వేలల్లో ఫీజులు వసూలు చేసే ప్రైవేటు పాఠశాలల్లో కొన్నిటిలో మాత్రమే కనీస సామర్థ్యాలు కనిపించాయి. ఇక్కడ చేరిన విద్యార్థుల నైపుణ్యాలు పరిశీలించగా ఈ విషయాలు బయట పడుతున్నాయని పలువురు ఉపాధ్యాయులు వెల్లడించారు. ప్రైవుటే పాటశాలల్లో విద్య మిధ్య అన్న నిజాన్ని అధికారులు గుర్తించారు. చాలాచోట్ల బట్టీ విధానం తప్ప పిల్లలకు అవగమయ్యే రీతిలో బోధించడం లేదని గుర్తించారు. పలు ప్రైవేటు
పాఠశాలల్లో గైడ్లు, పుస్తకాలపైనే ప్రధానంగా ఆధారపడుతున్నట్లు గుర్తించారు. తాజాగా గురుకులాలు మొదలయ్యాక అనేకమంది తల్లిదండ్రులు తమ పిల్లను ఇందులో చేర్చడానికి ఆసక్తి చూపుతున్నారు. దీనికితోడు పైసా ఖర్చు లేదన్న భావనలో తల్లిదండ్రులు ఉన్నారు. ఇదే సమయంలో పలుచోట్ల ప్రైవేట్ పాఠశాలల్లో చదివిన విద్యార్థుల నైపుణ్యాలను పరిశీలించి నప్పుడు డొల్ల బయటపడుతోంది. ఉపాధ్యాయులు పాఠాలు చెబుతున్నారే తప్ప విద్యార్థులకు అర్థమవుతుందో లేదో పట్టించుకోవటం లేదని
తేలిప్యింది. కొన్ని పాఠశాలల్లో విద్యార్థులే మెరుగైన సామర్థ్యాలు కనబరిచారు. కొన్ని పాఠశాలల్లో అక్షరాలను కూడా గుర్తించలేకపోయారు. పాఠశాలల్లో విద్యా ప్రమాణాల పరిస్థితి చూస్తే ప్రతి విద్యార్థి బట్టీ చదువులు మాత్రమే కొనసాగుతున్నాయి. విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంచే లక్ష్యంతో మూడేళ్ల నుంచి నిరంతర సమగ్ర మూల్యాంకనం(సీసీఈ)విధానాన్ని అమలుచేస్తున్నారు. అమలు ఎలాగుందో తెలుసుకునేందుకు జిల్లాల్లో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలను ఎంపిక చేశారు. ప్రధానంగా పదో తరగతి విద్యార్థులపై దృష్టిసారించగా అనేక లోపాలు బయటపడ్డాయి. గతేడాది కంటే ఈ ఏడాది పరిస్థితి కొంత మెరుగుపడటం వూరటనిచ్చే అంశం. ప్రాక్టికల్ బోధనతో విద్యార్థుల్లో ఆలోచనలు, శక్తి సామర్థ్యాలు పెంచడం, భావాలను రాత, మాటల రూపంలో వ్యక్తీకరించేలా తీర్చిదిద్దేందుకు నిరంతర సమగ్ర మూల్యాంకనం(సీసీఈ) విధానాన్ని ప్రభుత్వం అమలుచేస్తోంది. ఇది జిల్లాలో సరిగ్గా అమలు కావటం లేదు. కనీస సామర్థ్యాలు లేక విద్యార్థుల్లో సృజనాత్మకత కరవైంది. నైపుణ్య సాధనలో వెనుకబడింది. ప్రభుత్వ పాఠశాలల్లో సంగ్రహణాత్మక మూల్యాంకనం అమలు బాగుందని గుర్తించారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో సీసీఈ విధానం అన్ని విధాలుగా అమలయ్యేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. ప్రత్యేక చర్యలు తీసుకొని విద్యార్థుల్లో సామర్థ్యాలను పెంచేందుకు కృషి చేస్తామన్నారు. ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులకు దీనిపై అవగాహన కార్యక్రమం నిర్వహిస్తామని అన్నారు. జిల్లాలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన డిజిటల్ తరగతుల నిర్వహణలోనూ ప్రధానోపాధ్యాయులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఇదంతఆ ఒక ఎత్తయితే చాలా ప్రైవేట్ పాఠశాలలు తల్లిదండ్రులను మెప్పించడానికి మార్కులు వేసి చూపుతున్నారు. దీంతో పిల్లలకు జ్ఞానం అబ్బకున్నా, పాళ్యాంశాలపై పట్టు లేకున్నా పాస్ చేసి చూపిస్తున్నారు. ఇలాంటి వారు ఇప్పుడు గురుకులాల్లో చేరేసమయంలో బయటపడుతున్నారు.




