హైదరాబాద్: నగరంలోని గచ్చిబౌలి ఇందిరానగర్‌లోని ఎస్‌బీఐ ఏటీఎం వద్ద విషాద సంఘటన చోటు చేసుకుంది. గుర్తు తెలియని మహిళ(50)) మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలం నుంచి హైండ్ బ్యాగ్, ఏటీఎం కార్డు, బట్టల బ్యాగును స్వాధీనం చేసుకున్నారు.
గుర్తు తెలియని మహిళ మృతి




