గ్రామపంచాయతీ కార్మికుల డిమాండ్స్ నెరవేర్చాలి – మల్టీ పర్పస్ విధానాన్ని రద్దు చేయాలి – మంథని ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబు జనంసాక్షి, మంథని: గ్రామపంచాయతీ కార్మికుల న్యాయమైన డిమాండ్స్ ను వెంటనే పరిష్కరించాలని మంథని ఎమ్మెల్యే దుద్దుల్ల శ్రీధర్ బాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు . శనివారం పెద్దపల్లి జిల్లా మంథని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంథని మండల గ్రామ పంచాయతీ సిబ్బంది ఎమ్మెల్యే శ్రీధర్ బాబును కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ .. పంచాయతీ సిబ్బందినందరిని పర్మినెంట్ చేయాలని, పి.ఆర్.సి లో నిర్ణయించిన మినిమన్ బెసిక్ను వేతనంగా చెల్లించాలని , ఆ లోపు జీవో నెం. 60 ప్రకారం స్వీపర్లకు రూ.15,600, కారోబార్, బిల్ కలెక్టర్లకు రూ. 19500,కంప్యూటర్ ఆపరేటర్లకు రూ.22 750 నిర్ణయించాలని డిమాండ్ చేశారు. గ్రామపంచాయతీ సిబ్బంది వేతనాల కొరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక గ్రాంటును ఏర్పాటు చేయాలని ,ఆ గ్రాంట్ నుండే వేతనాలను చెల్లించాలన్నారు. ప్రస్తుతం పని చేస్తున్న వారందరికీ వేతనాలు పెంచాలి. మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేయాలని, వివిధ కేటగిరీలన్నింటినీ యధావిధిగా కొనసాగించాలన్నారు. కారోబార్, బిల్ కలెక్టర్ లకు స్పెషల్ స్టేటస్ కల్పించాలని వారికి పంచాయతీ అసిస్టెంట్ గా నామకరణం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మంథని మండలం అన్ని గ్రామపంచాయతీల సిబ్బంది, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
జనంసాక్షి, మంథని: గ్రామపంచాయతీ కార్మికుల న్యాయమైన డిమాండ్స్ ను వెంటనే పరిష్కరించాలని మంథని ఎమ్మెల్యే దుద్దుల్ల శ్రీధర్ బాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు . శనివారం పెద్దపల్లి జిల్లా మంథని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంథని మండల గ్రామ పంచాయతీ సిబ్బంది ఎమ్మెల్యే శ్రీధర్ బాబును కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ .. పంచాయతీ సిబ్బందినందరిని పర్మినెంట్ చేయాలని, పి.ఆర్.సి లో నిర్ణయించిన మినిమన్ బెసిక్ను వేతనంగా చెల్లించాలని , ఆ లోపు జీవో నెం. 60 ప్రకారం స్వీపర్లకు రూ.15,600, కారోబార్, బిల్ కలెక్టర్లకు రూ. 19500,కంప్యూటర్ ఆపరేటర్లకు రూ.22 750 నిర్ణయించాలని డిమాండ్ చేశారు. గ్రామపంచాయతీ సిబ్బంది వేతనాల కొరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక గ్రాంటును ఏర్పాటు చేయాలని ,ఆ గ్రాంట్ నుండే వేతనాలను చెల్లించాలన్నారు. ప్రస్తుతం పని చేస్తున్న వారందరికీ వేతనాలు పెంచాలి. మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేయాలని, వివిధ కేటగిరీలన్నింటినీ యధావిధిగా కొనసాగించాలన్నారు. కారోబార్, బిల్ కలెక్టర్ లకు స్పెషల్ స్టేటస్ కల్పించాలని వారికి పంచాయతీ అసిస్టెంట్ గా నామకరణం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మంథని మండలం అన్ని గ్రామపంచాయతీల సిబ్బంది, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.