ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి

మల్దకల్ సెప్టెంబర్ 26 (జనంసాక్షి) జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండల కేంద్రంలోని,తాసిల్దార్ కార్యాలయంలో చాకలి ఐలమ్మ జయంతి జరుపుకున్నారు.తాసిల్దారు హరికృష్ణ చిత్రపటానికి పూలమా చేసి ఘనంగా నివాళులర్పించారు. సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో వైస్ ఎంపీపీ  పెద్ద వీరన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో  కృష్ణయ్య ,మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ రామకృష్ణ, సీనియర్ అసిస్టెంట్ ఉదయ్ కిరణ్, సీనియర్ అసిస్టెంట్ సూర్య ప్రకాశ్ రెడ్డి, టైపిస్టు సుబ్రహ్మణ్యం, రెహమాన్,కంప్యూటర్ ఆపరేటర్ సాయి, సిబ్బంది సోమశేఖర్ ధరణి ఆపరేటర్ నవీన్ కుమార్, టిఆర్ఎస్ నాయకులు చంద్రశేఖర్ రెడ్డి, గోపాల్,వెంకట్, ప్రణీత తదితరులు ఉన్నారు.