Wednesday, 4 November 2026

ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు

వికారాబాద్ జిల్లా బ్యూరో జనం సాక్షి, సెప్టెంబర్ 26
 వీరనారి చాకలి ఐలమ్మ 127వ జయంతిని పురస్కరించుకొని బిసి సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక అంబేద్కర్ భవనంలో  వీరనారి చాకలి ఐలమ్మ చిత్ర పటానికి వికారాబాద్ శాసన సభ్యుడు డాక్టర్ మెతుకు ఆనంద్  పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ, భూమి కోసం, భూక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడిన గొప్ప పోరాట యోధురాలు ఐలమ్మ అని కొనియాడారు.  ఆమె త్యాగాలను  ఉద్యమ స్ఫూర్తిని భావి తరాలు గుర్తించుకొని అదే స్ఫూర్తితో ముందుకు సాగాలన్నారు. ఆమె అసలు పేరు చిట్యాల ఐలమ్మ అని కులం పేరుతో చాకలి ఐలమ్మగా ప్రసిద్ధి చెందిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వెనుక బడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి ఉపేందర్, షెడ్యూల్ కులాల సంక్షేమ శాఖ అధికారి మల్లేశం, వికారాబాద్ ఆర్డిఓ విజయకుమారి, తహసీల్దార్ షర్మిల, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు రాంరెడ్డి, బిసి సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Attachments area