ఘనంగా పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి వేడుకలు

సూర్యాపేట టౌన్ ( జనంసాక్షి):
పండిట్ దీన్‌ దయాళ్ ఉపాధ్యాయ ఆదర్శాలతో బీజేపీని బలోపేతం చేయాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వరరావు  అన్నారు.ఆదివారం జిల్లా కేంద్రంలోని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వరరావు నివాసంలో   పండిట్ దీన్‌ దయాళ్ ఉపాధ్యాయ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ అనేక సేవా కార్యక్రమాలను నిర్వహించారని అన్నారు.ఆయన రచించిన సిద్ధాంతాలనే ఆదర్శంగా తీసుకొని కార్యకర్తలు, నాయకులు పార్టీ పటిష్టత కొరకు పాటుపడుతున్నారని చెప్పారు.వికేంద్రికృత రాజకీయ వ్యవస్థ, స్వావలంబన ఆర్థిక వ్యవస్థలు గ్రామాభివృద్ధికి ప్రధాన ఆధారంగా ఉండాలన్న  ఆయన, భారతదేశం ఒక స్వతంత్ర స్వతంత్ర దేశంగా ఉండాలని భావించారని అన్నారు. ప్రజాస్వామ్యం , సామ్యవాదం , కమ్యూనిజం , పెట్టుబడిదారీ విధానం వంటి భావనలపై భారతదేశం ఆధారపడి ఉండకూడదని భావించిన వారు పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ అని తెలిపారు.ఈ కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి సంకినేని వరుణ్ రావు , పట్టణ అధ్యక్షులు ఎండీ అబిద్ , జిల్లా  ప్రధాన కార్యదర్శి సలిగంటి వీరేంద్ర , జిల్లా ఉపాధ్యక్షులు చల్లమల్ల నరసింహ, జిల్లా అధికార ప్రతినిధి పల్సా మల్సూర్ గౌడ్ , మండల అధ్యక్షులు వెన్న శశిధర్ రెడ్డి , దళిత మోర్చా జిల్లా అధ్యక్షులు వల్దాస్ ఉపేందర్, యువ మోర్చా పట్టణ అధ్యక్షులు దోసకాయల ఫణి నాయుడు తదితరులు పాల్గొన్నారు.