Wednesday, 4 November 2026

ఘనంగా భగత్ సింగ్ జయంతి వేడుకలు

జనంసాక్షి/చిగురుమామిడి – సెప్టెంబర్ 28: మండలంలోని మస్కు రాజిరెడ్డి భవన్ లో అఖిలభారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) ఆధ్వర్యంలో బుధవారం భగత్ సింగ్ 115వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం జిల్లా సహాయ కార్యదర్శి చట్ల సమ్మయ్య మాట్లాడుతు భగత్ సింగ్ జీవిత చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలని, ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు.ఈకార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు కొంకట ప్రశాంత్,మండల నాయకులు అజయ్,శ్రీను, మధు,అభినయ్, శ్రీజ, శిరీష, సంధ్య,మానస,మధుప్రియ పాల్గొన్నారు.