Tuesday, 3 November 2026

ఘనంగా భోగి పండుగ వేడుకలు

ఎల్బీనగర్  (జనం సాక్షి )  :సంక్రాంతి పండుగ పురస్కరించుకుని కైరా ఎంటర్ టైన్ మెంట్ ఆధ్వర్యంలో ఆదివారంఎల్బీనగర్లోని  శివగంగా కాలనీ ఆఫీసు వద్ద సంక్రాంతి సంబరాలలో భాగంగా భోగి పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ వేడుకల్లో కైరా ఫౌండేషన్ చైర్మన్ మొల్లేటి జగదీశ్వరి పాల్గొని అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం సాంప్రదాయబద్ధంగా భోగి మంటలు వేసి చుట్టూ తిరుగుతూ మహిళలు ఆడుతూ పాడుతూ నృత్యాలు చేశారు ఈ కార్యక్రమంలో ప్రతినిధులు వేదకీర్తి చెరుకు రామకృష్ణగౌడ్ అవినాష్ నీరు అనిత మధుకర్ మురళీ తదితరులు పాల్గొన్నారు