ఎల్బీనగర్ ( జనం సాక్షి )
సైదాబాద్ కరణ్ బాగ్ కాలనీ లోని అత్యంత పురాతనమైన , ప్రసిద్దిగాంచిన శ్రీశ్రీశ్రీ మల్లికార్జున స్వామి దేవాలయంలో మల్లన్న స్వామి కళ్యాణం ఆదివారం అత్యంత వైభవంగా నిర్వహించారు. మల్లన్న స్వామి కళ్యాణ మహాత్సవము లో చంపాపేట్ డివిజన్ కార్పొరేటర్ సామ రమణారెడ్డి పాల్గొన్ని , ప్రత్యేక పూజలు నిర్వహించారు. మల్లికార్జున స్వామి ఆలయాన్ని కళ్యాణ మహాత్సవం సందర్బంగా సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఆలయంలో మల్లన్న స్వామి కళ్యాణ మహాత్సవము సందర్బంగా మేలుకొలుపు , కొట్నం , శ్రీ బలిజ మెడలదేవి గొల్ల కేతమ్మ సమేత శ్రీ మల్లన్న స్వామి కళ్యాణం ,అన్నదానం తదితర కార్యక్రమములు నిర్వహించారు. మల్లన్న స్వామి కళ్యాణానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ మైల్ కోల్ మహేందర్ యాదవ్ , ప్రధాన కార్యదర్శి కోడె బ్రహ్మం ,కోశాధికారి శ్రీరాములు ముదిరాజ్ , సభ్యులు త్రిమూర్తులు ,వైవీ రామరాజు , రాధ ,లక్ష్మి కుమారి , మధుసూదన్ రావు ,మడిగల లక్ష్మా రెడ్డి ,బి.శివరాం తదితరులు పాల్గొన్నారు.




