ఘనంగా శ్రీ వెండి కొండ సిద్దేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు
*ఘనంగా శ్రీ వెండి కొండ సిద్దేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు*
*ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్*
*రాజేంద్రనగర్. ఆర్.సి (జనం సాక్షి) : రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ వెండి కొండ సిద్దేశ్వర దేవాలయం సిద్దుల గుట్టలో బ్రహ్మోత్సవాలు రెండు క్రితం ఘనంగా ప్రారంభమై సోమవారం ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్,మున్సిపల్ చైర్ పర్సన్ సుష్మారెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఉదయం తెల్లవారుజాము నుంచి అగ్నిగుండాలు,మహన్యాస రుద్రాభిషేకం,మహాబీక్వార్చన, వీరభద్ర స్వామి అభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన, అమృత స్నానాలతో బ్రహ్మోత్సవాలు ముగిసాయి. బ్రహ్మోత్సవాలు ముగింపు రోజు కావడంతో శంషాబాద్ నుండే కాకుండా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు.
అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించి బ్రహ్మోత్సవాలకు హాజరైన భక్తులకు అన్నదానం చేశారు.
ఈ కార్యక్రమంలో వైస్ చైర్మెన్ బండి గోపాల్, ఎంపిపి జయమ్మ శ్రీనివాస్, జెడ్పిటీసి నీరటీ తన్వీరాజ్ వైస్ ఎంపిపి నీలం మోహన్ నాయక్,డిసిసిబి డైరెక్టర్ బుర్కుంట సతీష్, కౌన్సిలర్లు బండి భాగ్యలక్ష్మి,అజయ్, శ్రీకాంత్ యాదవ్, మేకల వెంకటేష్, అమృతా రెడ్డి, నాయకులు గణేష్ గుప్త,మహేందర్ రెడ్డి, నీరటీ రాజు, శ్రీకాంత్ యాదవ్,చేవెళ్ళ ప్రసాద్,మనోహర్ గౌడ్,క్రిష్ణ కుమార్,హన్మంతు, మల్లేష్,శ్రీనివాస్ గౌడ్,శ్రీకాంత్ రెడ్డి, పాండు,రాహుల్,మున్సిపల్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఫోటో రైటప్ : శ్రీ వెండి కొండ సిద్ధేశ్వర స్వామికి పూజలు నిర్వహిస్తున్న ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, మున్సిపల్ చైర్పర్సన్ సుష్మారెడ్డి.
ఫోటో రైటప్ : శ్రీ వెండికొండ సిద్దేశ్వర స్వామి ఊరేగింపు.