పత్రాలను నింపేందుకు ముందుకొస్తున్న రైతులు
ముమ్మరంగా గ్రామాల్లో సర్వే చేస్తున్న వ్యవసాయ అధికారులు
హైదరాబాద్,జూన్14(జనం సాక్షి): జిల్లాల్లో రైతు బీమా పక్రియ వేగంగా సాగుతోంది. ఆగస్ట్ నుంచి బీమా అమలు కానుండడంతో రైతులు కూడా ఆస్తి చూపుతున్నారు. అధికరాఉల అడిగిన సమాచారాన్ని ఇస్తున్నారు. రైతుబంధు సాయం అందడంతో ఇప్పుడు వీరిలో భరోసా పెరగింది. దీంతో మండలాల వారీగావ్యవసాయ అధికారులు, ఏఈవోలు, ఇతర సిబ్బంది గ్రామాల్లో పర్యటిస్తూ రైతులకు సంబంధించిన ఆధార్‌కార్డు, పట్టాదారు పుస్తకాలు, నామినీల వివరాలు సేకరిస్తున్నారు. ఈ పథకంలో గ్రామాల్లోని 18 నుంచి 59 ఏళ్ల వయస్సున్న రైతులు అర్హులు కాగా.. బీమాకు అవసరమైన ప్రీమియం రూ.22 72ని ప్రభుత్వం చెల్లిస్తుంది. రైతు ఏ కారణంతో చనిపోయినా ఆ కుటుంబ సభ్యులు ఇబ్బందులు పడకుండా బీమా పరిహారంలో రూ.5 లక్షలు అందజేస్తారు. ఇటీవల భూ సమగ్ర సర్వేలో సేకరించిన వివరాల ఆధారంగా రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలను పంపిణీ చేశారు. ఈ వివరాలు ఆధారంగా జిల్లాల్లో బీమా ప్రింటెడ్ పత్రాలను అధికారులు క్షేత్రస్థాయి సిబ్బందికి పంపిణీ చేశారు. ఈ ప త్రాల్లో గ్రామాల్లోని రైతులకు సంబంధించిన పూర్తి వివరాలు ఉంటాయి. వీటిని పాసు పుస్తకాలతో సరిచూసుకుంటున్నారు.18 నుంచి 59 ఏళ్లున్న రైతులకు బీమా వర్తిస్తుండడంతో వయస్సు నిర్ధారణ తప్పనిసరిగా మారింది. ఆధార్‌కార్డులోని వయస్సును పరిగణలోకి తీసుకుంటున్నారు. రైతులకు బీమా పథకం ఈ ఏడాది ఆగస్టు 15 నుంచి ప్రారంభంకానుండగా.. ఈలోపు జిల్లాలో ఇందుకు సంబంధించిన పక్రియ ను పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. గ్రామాల్లోని రైతు కుటుంబాల్లో నామినీని నిర్ధారణ చేస్తూ నామినేషన్ ఫారంపై పట్టాదారు సంతకం తీసుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మూడ్రోజుల కిందట ఈ పక్రియ ప్రారంభంకాగా.. గ్రామాల్లో వ్యవసాయ అధికారులు రైతుల వివరాలు సేకరించేపనిలో పడ్డారు. వ్యవసాయ శాఖ ఏడీఏలు, ఏవోలు గ్రా మాల్లో పర్యటిస్తూ బీమా వివరాల సేకరణను పరిశీలిస్తున్నారు. రోజు ఎన్ని గ్రామాల్లో ఎంత మంది రైతుల వివరాలను పత్రాల్లో పొందుపర్చారనే విషయాలను తీసుకొని ఉన్నతాధికారులకు ఎప్పటికప్పుడు నివేదికలు అందజేస్తున్నారు. జూలై 10 వరకు జిల్లా వ్యాప్తంగా పూర్తి స్థాయి వివరాలు సేకరిస్తామని అధికారులు అంటున్నారు. గ్రామాల్లోని రైతు సమన్వయ సమితుల సభ్యులు అధికారులకు సహకారం అందిస్తున్నారు. గ్రామాల్లోని రైతులు అధికారులకు పట్టాదారు పాసుపుస్తకాల్లోని వివరాలు, ఆధార్‌కార్డు, నామినీ, ఇతర విషయాలను చెబుతున్నారు.




