*జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడికి ఘనసన్మానం….*

కుబీర్ ( జనం సాక్షి ); కుబీర్
మండలంలోని  పల్సి
హైస్కూల్లో, పల్సి  ప్రధానోపాధ్యాయులైన దంతుల సురేష్  జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డును జిల్లా పాలన అధికారి, మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి  చేతులమీదుగా  అవార్డు అందుకున్న సందర్భముగా పల్సి పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులందరు ఘనంగా సన్మానించడం జరిగింది.  సన్మాన గ్రహీత యొక్క  వ్యక్తిత్వాన్ని  వృత్తి పట్ల నిబద్ధతను, కష్టానికి తగిన గుర్తింపును ప్రభుత్వం ఆలస్యంగా అయిన గుర్తిచడం హర్షణీయం అని మండల విద్యాధికారి బుద్దొల్ల చంద్రకాంత్ కొనియాడారు.
 ఈ సందర్భంగా  సమాజంలో ఉపాధ్యాయ వృత్తి చాలా గొప్పదని తమ యొక్క వృత్తిని బాధ్యతయుతముగా నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ భలేరవ్ సంజీవ్, కుబీర్ ప్రధానోపాధ్యాయులు సాయన్న, మలేగం ప్రధానోపాధ్యాయులు పోశెట్టి,  ఉపాధ్యాయ బృందం, ఎస్ టి యు జనరల్ సెక్రటరీ నాగభూశన్, వడ్నం నగేష్, ఎం ఆర్ సి సిబ్బంది, గణేష్,
సి.అర్పీలు, ఉపాద్యాయులు విద్యార్ధులు, ఉపాధ్యాయులు,  పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు..