Thursday, 5 November 2026

జై మహా భారత పార్టీ అభ్యర్థిగా మారగోని జయశ్రీగౌడ్

మునుగోడు అక్టోబర్11(జనంసాక్షి):
మునుగోడు ఉప ఎన్నికలలొ జై మహాభారత్ పార్టీ అభ్యర్థిగా రాష్ట్ర వర్కింగ్ కమిటీ మెంబర్ మారగొని జయశ్రీగౌడ్ ను మునుగోడు శాసన సభ ఉపఎన్నికల్లో జై మహా భారత్ పార్టీ అభ్యర్థిగా ఆపార్టీ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు భగవాన్ శ్రీ అనంత విష్ణు ప్రభు ప్రకటించారు.
మంగళవారం విలేకరుల సమావేశంలో భగవాన్ శ్రీ అనంత విష్ణుప్రభు మాట్లాడుతూ నియోజకవర్గంలో బిసి ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు అధిక జనాభా ఉండి కూడా మునుగోడు నియోజక వర్గంలో మూడు ప్రధాన పార్టీలు కేవలం ఓకే సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థినిి పోటీకి దించడం శోచనీయమన్నారు.జై మహాభారత్ పార్టీ సామాజిక రాజ్యాధికారమే లక్ష్యంగా ఒక బిసి మహిళ అభ్యర్థీనీ మునుగోడు ఉప ఎన్నిక బరిలో బిసి వర్గానికి చెందిన మహిళా జై మహా భారత్ పార్టీ అభ్యర్థి అయిన మారగోని జయశ్రీ గౌడ్ ని అధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా నియోజవర్గ ప్రజలను కోరారు.
Attachments area