టిఆర్ఎస్ అభ్యర్థికి కురుమ సంఘం మద్దతు
ఆత్మీయ సమ్మేళనం లో ఏకగ్రీవ తీర్మాణం
మునుగోడు అక్టోబర్14(జనం సాక్షి):
మునుగోడు ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థికి మద్దతు ఇస్తామని తెలంగాణ కురుమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్సీ ఎగ్గ మల్లేశం అన్నారు.మండలంలోని కోరటికల్ గ్రామంలో ఏర్పాటు చేసిన కురుమ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసి కురుమలంత కలిసి తెరాసాకు మద్దతు ఇవ్వాలనితీర్మాణంచేశారు.ఈసమావేశానికిముఖ్యఅతిథిగా
రాష్ట్రరవాణా శాఖమంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హాజరై మాట్లాడుతూ టిఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి కురుమల నుంచి మంచి స్పందన వస్తుందని తెలిపారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కురుమలకు గొర్లు పంపిణీచేసిన ఏకైక ముఖ్యమంత్రి మన కేసీఆర్ అని తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న ఏ ఒక్క సంక్షేమ పథకాలు దేశంలో లేవని గొల్ల కురుమల భవనానికి కేసీఆర్15ఎకరాల విస్తీర్ణంలో భావన నిర్మాణం జరుగుతుందని గొల్ల కురుమల అభివృద్ధి టిఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమవుతుందని అన్నారు.గొల్ల కురుమల అభివృద్ధికి రాష్ట్రప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు.రాష్ట్ర ఏర్పాటు తర్వాత కురుమలకు ఎమ్మెల్సీ ఇచ్చిన గౌరవించిన ఘనత కేసిఆర్ కి చెందిన అని గుర్తుచేశారు.టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి విజయం కోసం అందరూ కృషి చేయాలన్నారు. ఈకార్యక్రమానికి సభాధ్యక్షులు టిఆర్ఎస్ మండల ఉపాధ్యక్షులు మందుల సత్యంకురుమ,గ్రామసర్పంచ్ వల్లూరి పద్మలింగయ్య కురుమ,ఎంపిటిసి మిరియాల లక్ష్మమ్మబీరయ్యకురుమ,కురుమ ప్రజాప్రతినిధులు కుల పెద్దలు తదితరులు పాల్గొన్నారు.