*టిఆర్ఎస్ గెలుపుకై దళితవాడలో ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం*
మునగాల, సెప్టెంబర్27(జనంసాక్షి): చౌటుప్పల్ మండల పరిధిలోని తుఫ్రాన్ పేట్ గ్రామంలో కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ ఆదేశానుసారం మునగాల మండల పార్టీ అధ్యక్షుడు తొగరు రమేష్ సూచనల మేరకు దళితుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో మంగళవారం మునగాల మండల టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. చండూరు మండలం బంగారిగడ్డ దళిత కాలనీలో గడపగడపకు తిరుగుతూ కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించారు. అనంతరం వారు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళన సభలో మాట్లాడుతూ, అభివృద్ధి సంక్షేమాన్ని గుర్తించి వారికి పట్టం కట్టాలని అదేవిధంగా పుట్టిన బిడ్డనుండి ముసలితనం వరకు ప్రతి కుటుంబంలో ఎవరికైనా కెసిఆర్ ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకం ఏదో ఒక రూపేనా వారింటికి చేరుతుందని వారు అన్నారు. కెసిఆర్ ప్రవేశపెడుతున్న సంక్షేమాన్ని గుర్తించి కారు గుర్తుపై ఓటేసి టీఆర్ఎస్ అభ్యర్థిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో నకరికల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, ముకుందాపురం టిఆర్ఎస్ పార్టీ నాయకుడు నూకమళ్ల రామకృష్ణ, కలకోవ మాజీ సర్పంచ్ చిర్రా శ్రీనివాస్, టిఆర్ఎస్ మహిళా నాయకురాలు రాణి, రేపాల ఎంపీటీసీ సోమపంగు మోహన్, స్థానిక నాయకులు, ఎల్. శ్రీను, స్థానిక టిఆర్ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.