టియుడబ్ల్యుజె ఐ జె యు సహాయ కార్యదర్శిగా ప్రశాంత్
మహబూబాబాద్ ప్రతినిధి ఆగస్టు 16 (జనం సాక్షి)
టీయూడబ్ల్యూజేఐజేయు మహబూబాబాద్ జిల్లా సహాయ కార్యదర్శిగా జనం సాక్షి పత్రిక బ్యూరో రావూరి ప్రశాంత్ ఎన్నికయ్యారు. తనకు జిల్లా కార్యవర్గంలో చోటు దక్కడం పట్ల ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు.తన ఎన్నికకు అన్ని విధాలుగా సహకరించిన టియు డబ్ల్యూజే ఐ జే యు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు అయిన చిత్తలూరు శ్రీనివాస్, గాడి పళ్లి శ్రీహరి,గండి సీతారాములుకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. అంతేకాకుండా తాను అన్నివేళలా కార్యవర్గానికి అందుబాటులో ఉండి పాత్రికేయ మిత్రుల సమస్యల పరిష్కారానికి తన వంతు సహకారం అందిస్తానని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.రావూరి ప్రశాంత్ కు జిల్లా కార్యవర్గంలో చోటు దక్కడం పట్ల వివిధ మండలాలకు చెందిన పాత్రికేయులు హర్షం వ్యక్తం చేయడమే కాకుండా ఆయనను అభినందించారు.