టీఎన్జీవో పోరాటాల్లో జర్నలిస్టుల భాగస్వామ్యం మర్చిపోలేనిది
కరీంనగర్ బ్యూరో (జనం సాక్షి) :
తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం కరీంనగర్ జిల్లా శాఖ నూతన కార్యవర్గాన్ని టిఎన్జీవోల సంఘం సోమవారం ఘనంగా సత్కరించింది. టీఎన్జీవోల సంఘ భవనంలో జరిగిన ఈ కార్యక్రమంలో టీఎన్జీవోల జిల్లా సంఘం అధ్యక్షుడు మారం జగదీశ్వర్, కార్యదర్శి దారం శ్రీనివాస్ రెడ్డి, కోశాధికారి ముప్పిడి కిరణ్ కుమార్ రెడ్డి, రూరల్ అధ్యక్షులు మారుపాక రాజేష్ భరద్వాజ్, క్లాస్ ఫోర్ ఎంప్లాయిస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కోట రామస్వామి, కార్యదర్శి నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
టీఎన్జీవోల పోరాటాల్లో జర్నలిస్టుల భాగస్వామ్యం మర్చిపోలేనిదని సంఘ నేతలు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక వర్గ పోరాటాలలో కరీంనగర్ జర్నలిస్టులు ముందు వరుసలో నిలిచారని కొనియాడారు.
భవిష్యత్తు పోరాటాలలో కలిసి నడవాలని నిర్ణయించారు.
టియుడబ్ల్యూజే కరీంనగర్ జిల్లా శాఖ అధ్యక్షుడు తాడూరు కరుణాకర్, కార్యదర్శి గాండ్ల శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు వి విజయభాస్కర్, ఆర్గనైజింగ్ కార్యదర్శులు అల్లాడి శ్రీనివాస్, టి వేణుగోపాల్, సహాయ కార్యదర్శి అసద్, దారం జగన్నాథ్ రెడ్డి, కోశాధికారి సందీప్ కుమార్, కార్యవర్గ సభ్యుడు ఏనుగు శ్రీనివాస్ రెడ్డి, జాతీయ కౌన్సిల్ కు నూతనంగా ఎన్నికైన ఎలగందుల రవీందర్ తదితరులను టీఎన్జీవోల సంఘం నేతలు శాలువలతో ఘనంగా సత్కరించారు.