బిజినేపల్లి, జనం సాక్షి. అక్టోబరు 13: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎనముల రేవంత్‌రెడ్డిని గురువారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యకుడు. కూచుకుళ్ల సుహాసన్‌రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా కూచుకుళ్లు సుహాసన్‌రెడ్డి మాట్లాడుతూ పార్టీ పటిష్టత కోసం బిజినేపల్లి మండలంలో పర్యటించాలని టీపీసీసీ అధ్యక్షుడిని కోరినట్లు తెలిపారు. ఆయన వెంట పీఏసీఎస్ డైరెక్టర్ దీప్లానాయక్, గోపినాయక్, శివ, తుల్య, వాసు, రవి, ధర్మ, శ్రీను తదితరులు ఉన్నారు.
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నీ కలిసిన మండల కాంగ్రెస్ నాయకులు




