టీయూడబ్ల్యూజే ఐజేయు ద్వితీయ మహాసభను విజయవంతం చేయండి -జిల్లా కమిటీ సభ్యులు షేక్ భూడాన్,రావూరి ప్రశాంత్
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఈ నెల 13న జరిగే ద్వితీయ మహాసభను విజయవంతం చేయాలని యూనియన్ జిల్లా కమిటీ సభ్యులు షేక్ బుడన్ కోరారు. గార్ల మండల కేంద్రంలోని వర్థకసంఘం భవనంలో బుధవారం రావూరి ప్రశాంత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మండల ఐజేయు సభ్యుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. టి యు డబల్ యు జె, ఐ జె యు మహాసభలను జయప్రదం చేయాలని జిల్లాలోని రిపోర్టర్లు మరియు విలేకరులందరూ పాల్గొని జయప్రదం చేయడానికి ప్రతీ జర్నలిస్ట్ తనవంతు కృషి చేయాలని కోరారు. ప్రభుత్వం జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, డబుల్ బెడ్రూం ఇల్లు, దళితబంధు, బీసీ బంధు, మైనార్టీ బంధు అందించాలని, హెల్త్ కార్డులపై మెరుగైన వైద్యం, జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్య అందించాలని, విలేకరులు ఎదుర్కొంటున్న ముఖ్యమైన సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, జర్నలిస్టులకు అండగా నిలవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో నెలం శ్రీనివాస్, రూపన్ శంకర్, తోడేటి రాము, కందునూరి ఈశ్వరలింగం, వజ్రం నాగేశ్వరరావు, మహమ్మద్ జాన్ ఖాన్, పగడల రామారావు, కునమల కృష్ణ, దువ్వా సతీష్, మాధ శ్రీకాంత్,తేజావాత్ తరుణ్, కిషన్ నాయక్, తదితరులు మండలంలోని విలేకరులు పాల్గొనడం జరిగింది.