డాక్టర్ ఉషారాణి అకాల మృతి

జనం సాక్షి నర్సంపేట

నర్సంపేట పట్టణ ప్రజలకు సుపరిచితురాలు డాక్టర్ చామర్తి ఉషారాణి నేటి ఉదయం గుండెపోటుతో అకాల మరణం చెందారు బద్రీనాథ్ యాత్రలో ఉత్తరాంచల్ రాష్ట్రంలో ఉన్న ఉషారాణి నేటి తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందడం కుటుంబ సభ్యులతో పాటు వేలాది మంది అభిమానులకు దిగ్భ్రాంతి కలిగించారు. ఆమె అకాల మరణం చెందిన పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఉషారాణికి ఇద్దరు కూతుర్లు భర్త నందకిషోర్ ఉన్నారు. ఉషారాణి పార్దివ దేహాన్ని ఉత్తరాంచలండి తీసుకు రావడానికి కుటుంబ సభ్యులు సన్నాహాలు చేస్తున్నారు.ఉషారాణి పార్థివ దేహానికి పోస్టుమార్టం నిర్వహించ నున్నట్లు బంధువుల ద్వారా తెలిసింది.
ఉషారాణి పార్థివ దేహం వెంట భర్త నందకిషోర్ ఉన్నారు.