డివిజన్ సాధించలేని ఎమ్మెల్యే రాజీనామా చేయాలి
చేర్యాల జాక్ చైర్మన్ భైరవబట్ల చక్రధర్
చేర్యాల (జనంసాక్షి) సెప్టెంబర్ 27 : చేర్యాల డివిజన్ సాధించలేని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి తమ పదవికి వెంటనే రాజీనామా చేయాలని చేర్యాల జాక్ చైర్మన్ భైరవబట్ల చక్రధర్ డిమాండ్ చేశారు. మంగళవారం వారు విలేకరులతో మాట్లాడుతూ.. ప్రజల అభీష్టం మేరకు జరుగుతున్న రెవెన్యూ డివిజన్ అంశం రాబోయే రోజుల్లో ఎన్నికల ప్రధాన అంశంగా ప్రజల ముందుకు తీసుకు వెళతామన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో స్థానిక ఎమ్మెల్యే, టీఆర్ఎస్ నాయకులు ఇచ్చిన హామీలు బూటకమని, ప్రజలకు వివారిస్తానని చెప్పారు. గత నాలుగు ఏళ్లుగా చేర్యాల రెవెన్యూ డివిజన్ అంశం జాక్ ఆధ్వర్యంలో ఉద్యమం జరుగుతున్నప్పటికీ ఎమ్మెల్యే, టిఆర్ఎస్ నేతలు, ప్రజాప్రతినిధులు పట్టించుకొకపోవడం ఏమిటని విమర్శించారు. చేర్యాల, మద్దూరు,కొమురవేల్లి, అధికార పార్టీ నాయకులను ప్రజలు క్షమించరని, రాబోయే ఎన్నికల్లో వారికి ప్రజలు రాజకీయ సమాధి కడతారని చైర్మన్ పేర్కొన్నారు. చేర్యాల ప్రాంత ప్రజలను మోసం చేస్తూ డివిజన్ కాకుండా అడ్డు పడుతున్న ముత్తిరెడ్డికి రాబోయే ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పాలని విజ్ఞప్తి చేశారు. నాలుగు మండలాల స్థానిక అధికార ప్రజాప్రతినిధులు తమ పదవులకు రాజీనామాలు చేసి తల్లిపాల రుణం తీసుకోవాలని ఆయన కోరారు.
Attachments area