Tuesday, 3 November 2026

ఢిల్లీ రాంలీలా మైదానంలో నిర్వహించబోయే సభ విజయవంతం చేయాలి :కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దేప భాస్కర్ రెడ్డి

ఎల్బీనగర్ (జనం సాక్షి )   ఏఐసీసీ  ఆదేశాల మేరకు టిపిసిసి  అధ్యక్షలు ఏనుముల రేవంత్ రెడ్డి  పిలుపు మేరకు గురువారం  గాంధీ భవన్ లో  డిసిసి  అధ్యక్షులు చల్లా నరసింహారెడ్డి అధ్యక్షతలో జరిగిన ఛలో ఢిల్లీ ముఖ్య నాయకుల సమవేశంలో ముఖ్య అతిథిగా మాజీ శాసనసభ్యులు  మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దేప భాస్కర్ రెడ్డి ఈ సదర్భంగా భాస్కర్ రెడ్డి  మాట్లాడుతూ గత ఎనిమిది సంవత్సరాలుగా కేంద్ర  ప్రభుత్వం అధికారం లో వుండి గ్యాస్ ,పెట్రోలు,డీజిల్  నిత్యావసరాల ధరలు పేంచి  సామాన్య ప్రజల పై భారం మోపుతున్నందుకుగాను ఛలో ఢిల్లీ రాంలీలా మైదానంలో నిర్వహించబోయే సభకు మహేశ్వరం నియోజకవర్గం నుండి  కాంగ్రెస్ పార్టీ డివిజన్ , మండల్& మున్సిపల్ కార్పొరేషన్   మున్సిపాలిటీ అధ్యక్షులు  మహిళా అధ్యక్షురాలు, నాయకులు, కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున  పాల్గొని సభను విజయవంతం చేయాలని కోరారు.