*తాసిల్దార్ కార్యాలయం ముందు VRA ల రెండవ రోజు నిరవధిక సమ్మె*

జనంసాక్షి: (మద్దూర్ మండలం):
నారాయణపేట జిల్లా మద్దూర్ మండలం తాసిల్దార్ కార్యాలయం ముందు VRA లు 2వ రోజు నిరవధిక సమ్మె నిర్వహించారు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ నిండు అసెంబ్లీ సాక్షిగా వీఆర్ఏలకు  ప్రకటించిన హామీలను వెంటనే అమలు చేయాలంటూ VRA లు డిమాండ్ చేశారు, పే స్కేల్ జీవోను వెంటనే విడుదల చేయాలని కోరారు, అర్హత కలిగిన VRA లకు  వెంటనే పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు..55  సంవత్సరాలు పైబడిన వీఆర్ఏ వారసులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు, ఈ కార్యక్రమంలో  తెలంగాణ రైతు సంఘం జిల్లా కన్వీనర్ అంజలయ్యగౌడ్ మరియు మండల రైతు కార్మికుల సంఘం కన్వీనర్ హనుమంతు  వీఆర్ఏలకు మద్దతు తెలిపారు.  మండల VRA-JAC అధ్యక్షుడు లక్ష్మప్ప. జిల్లా అధ్యక్షుడు రాచూరి కనకప్ప, కో- కన్వీనర్ సత్యప్ప, ఆంజనేయులు, మొగులప్పా, రాములు, కేశవులు, వేణు, బసప్ప,తదితరులు పాల్గొన్నారు…

 
 2 Attachments