ఎన్నో అన్యాయాలకు గగురైందని వివరణ
అందుకే ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడామని వెల్లడి
హైదరాబాద్,మార్చి9(జనం సాక్షి): అనుకున్నట్లు గానే అసెంబ్లీలో ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు కీలక ప్రకటన చేశారు. వనపర్తిలో చేసిన ప్రకటన ఆధారంగా అసెంబ్లీలో భారీ ఉద్యోగ ప్రకటన చేశారు. తెలంగాణ ఉద్యమం, అనంతరం స్వరాష్ట్ర సాధన విషయాలను సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా మరోమారు ప్రస్తావించారు. తెలంగాణ ఏర్పాటు చరిత్రలో ఒక ప్రత్యేక ఘట్టం అన్న కేసీఆర్.. తెలంగాణ తొలిదశలో ఉద్యమంలో నేనూ కూడా లాఠీదెబ్బలు తిన్నా.. వివక్ష, అన్యాయంతో తెలంగాణ నలిగిపోయిందన్నారు.తెలంగాణలో వేరే పార్టీలకు రాజకీయాలంటే ఓ గేమ్.. కానీ టీఆర్ఎస్ పార్టీకి రాజకీయాలంటే ఓ టాస్క్. ఈ రోజు తెలుగు సినిమాల్లో తెలంగాణ భాష పెడితేనే సినిమా హీరో క్లిక్ అవుతున్నాడు.. ఒకప్పుడు తెలంగాణ భాషను జోకర్లా పెట్టేవారని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ కోసం విద్యార్థులు ఉద్యమం చేశారని గుర్తు చేశారు. వివక్ష, అన్యాయంతో తెలంగాణ సమాజం నలిగి పోయిందన్న కేసీఆర్.. ఆకలిచావులు, ఆత్మహత్యలు, లక్షల సంఖ్యలో వలసలు గతంలో నిత్యకృత్య మన్నారు. ఉద్యోగాలు రాలేదన్న బాధతో ఉన్న నిరుద్యోగులను.. తెలంగాణ సమాజంలో చూశామన్న కేసీఆర్ తెలంగాణ ప్రజలకు ఉమ్మడి రాష్ట్రంలో న్యాయం జరగదని, అందుకే పిడికెడు మందితో పోరాటం ప్రారంభించానన్నారు.14 ఏళ్ల సుదీర్ఘ పోరాటంతో రాష్ట్రం సాకారమైందన్నారు. తెలంగాణ ఏర్పాటు దేశ చరిత్రలో ప్రత్యేక ఘట్టమని గుర్తు చేశారు. హైదరాబాద్ కొంతకాలం దేశంగా పరిగణించబడిరదన్నారు. భారత యూనియన్లో విలీనమయ్యాక రాష్ట్రంగా మారిందన్నారు. అనంతరం హైదరాబాద్ ఏపీలో అంతర్భాగమైంది కేసీఆర్ అన్నారు. తెలంగాణకు దశబ్దాల తరబడి అంతులేని అన్యాయానికి గురైందన్నారు. తెలంగాణలో ప్రజలు క్షోభ, బాధ అనుభవించారని, తెలంగాణలో ఆకలి చావులు, ఆత్మహత్యలు కూడా చూశామని అంతేకాదు.. నిరాశలో ఉన్న యువత తుపాకులు పట్టి ఉద్యమం చేపట్టిందని కేసీఆర్ అన్నారు. 11 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత తెలంగాణ కల సాకారమైందని కేసీఆర్ అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఉద్యమం జరిగిందన్నారు. ఇప్పుడు అడ్డం పొడవు మాట్లాడేవాళ్లు గతంలో ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. తెలంగాణ భాష, సంస్కృతి వైభవం అధికారికంగా జరుపుకుంటున్నామన్నారు. గతంలో తెలంగాణ భాష మాట్లాడితే జోకర్లా చూసేవారని, ఇప్పుడు తెలంగాణ భాష మాట్లాడితేనే సినిమా సక్సెస్ అవుతుందని కేసీఆర్ అన్నారు.




