*తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల సంబరాలను ఘనంగా నిర్వహించాలి డి సి సివైస్ చైర్మన్ కుందూరు వెంకటేశ్వర్ రెడ్డి*

కొడకండ్ల, సెప్టెంబర్14( జనం సాక్షి )
తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల సంబరాల అంబరాన్ని అంటేలా నిర్వహించాలని ఉమ్మడి వరంగల్ జిల్లా డీసీసీ వైస్ చైర్మన్ కుందూరు వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు.రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశానుసారం టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు సిందే రామోజీ ఆధ్వర్యంలో కొడకండ్ల మండలంలోనిలక్ష్మక్కపల్లి,పెద్దబాయితండా,బోడోనికుంటా తండా,రామన్నగూడెం, మొoడ్రయి,
గిర్నీతండా,Mcతండా,నిలిబండ తండా,సీఎంతండా, రామేశ్వరం,
పాకాల, గ్రామమాలలో  ఆయా గ్రామాల గ్రామపార్టీ అధ్యక్షులు,సర్పంచులు, ఎంపీటీసీల ఆధ్వర్యంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో  వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ఈనెల 16,17,18 తేదీల్లో జరగనున్న తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల కార్యక్రమాలను ఘనంగా నిర్వహించాలని కార్యకర్తలకు సూచించారు.ఈ నెల 16 వ తేదీన పాలకుర్తి నియోజకవర్గం లో జరగనున్న భారీ ర్యాలీ, బహిరంగ సభకు అధిక సంఖ్యలో మండల ప్రజలు, పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. 17 వ తేదిన గ్రామంలో గ్రామ పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు జాతీయ జెండా ఎగరవేయాలని పిలుపునిచ్చారు.హైదరాబాద్ లో బంజారా భవన్, ఆదివాసీ భవన్ ప్రారంభ కార్యక్రమంలో అధిక సంఖ్యలో గిరిజనులు పాల్గొని విజయవంతం చేయాలనీ పిలుపు నిచ్చారు. ఈ సమావేశంలోఎంపీపీ ధరవత్ జ్యోతి
జడ్పీటీసీ కేలోత్ సతెమ్మమార్కెట్ చెర్మెన్ పేరం రాము
మండల రైతు బంధు అధ్యక్షులు దికొండా వెంకటేశ్వర రావురాష్ట్ర Egs  కౌన్సిల్ సభ్యులుఅందే యాకయ్య
మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడు పసునూరి మధుసూదన్మండల పార్టీ ప్రధానకార్యదర్శి కైరోజు సత్యనారాయణ,మండల పార్టీ ఉపాధ్యక్షుడు
Md అసిఫ్,మండల సీనియర్ నాయకులు చెంచు రాజిరెడ్డి,బాకి ప్రేమకుమార్, మండల యూత్అధ్యక్షుడు సతిష్ గౌడ్, St సెల్ అధ్యక్షుడు భూక్య మగ్యా నాయక్,పార్టీ ముఖ్యనాయకులు పాల్గొన్నారు.