తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ.
బిజెపి వికారాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి యు రమేష్ కుమార్.
తాండూరు సెప్టెంబర్ 10(జనంసాక్షి)వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలోనీ వి వి హెచ్ ఎస్ కూడలిలో చాకలి ఐలమ్మ 37వ వర్ధంతి సందర్భంగా ఐలమ్మ విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా బిజెపి వికారాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి యు రమేష్ కుమార్ మాట్లాడుతూ
అగ్రకులాల స్త్రీలు, దొరసానులు తమను కూడా ‘దొరా’ అని ఉత్పత్తికులాల (బీసీ కులాల) చేత పిలుపించుకొనే సంస్కృతికి చరమగీతం పాడినవారిలో ఐలమ్మ ముందంజలో ఉన్నారు. దొరా అని పిలువకపోతే ఉన్నతకులాలతో పాటు వారి అనుంగు ఉంపుడుకత్తెలలో కూడా ఉన్న రాక్షస ప్రవృత్తి అనేక పీడన రూపాలలో బయటకు వచ్చేది. వెనుకబడిన కులాల మీద ఆ పీడన రూపాలు విరుచుకుపడేవి. తమను దొరా అని పిలువని ఉత్పత్తి కులాల స్త్రీల మీద తమ భర్తలను ఉసిగొల్పి, దగ్గరుండి ఆఘాయిత్యం చేయించేవారు. ఈ భూమినాది… పండించిన పంటనాది… తీసుకెళ్లడానికి దొరెవ్వడు… నా ప్రాణం పోయాకే ఈ పంట, భూమి మీరు దక్కించుకోగలరు..అంటూ మాటల్ని తూటాలుగా మల్చుకొని దొరల గుండెల్లో బడబాగ్నిలా రగిలిన తెలంగాణ రెైతాంగ విప్లవాగ్ని చాకలి అయిలమ్మ అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు గొర్రెపల్లి సుదర్శన్ గౌడ్, జిల్లా కార్యదర్శి బండారం భద్రేశ్వర్, సీనియర్ నాయకులు పూజారి పండు, అంతారం కిరణ్, నీరటీ రవి, విక్రం రెడ్డి, చంద్రశేఖర్, రాం సాగర్, గోవింద సభ, చందు , రజక సంఘం కమిటీ అధ్యక్షులు రమేష్ , ఉపాధ్యక్షులు బసవరాజు , ప్రధాన కార్యదర్శి రవి , శేఖర్ , నర్సింలు , రాజు, జయ మహేష్ , తదితరులు పాల్గొన్నారు.