తెలంగాణ సంస్క్రతికి నిదర్శనం బోడ్డెమ్మ , బతుకమ్మ పండుగలు
మరిపెడ, సెప్టెంబర్ 24(జనం సాక్షి ): సంస్క్రతి, సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనం బోడ్డెమ్మ, బతుకమ్మ పండుగలని ఎంపీపీ గుగులోత్ అరుణ రాంబాబు, జడ్పీటీసీ తేజావత్ శారద రవీందర్ లు అన్నారు. శనివారం మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో అంగన్వాడీటీచర్ల ఆధ్వర్యంలో బోడ్డెమ్మ, బతుకమ్మ పండుగలను నిర్వహించారు. ఈ కార్యక్రమం లో ముఖ్య అతిధిలుగా పాల్గొని వారు మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడ లేని విదంగా పూలపండుగను తెలంగాణ ప్రజలు నిర్వహించడం చాల గొప్ప విషయమాన్నారు. ఈ కార్యక్రమం లో అంగన్వాడీ టీచర్లు, అయాలు తదితరులు పాల్గొన్నారు.