తెలుగు భాషోద్యమ నేత గిడుగు:-
మిర్యాలగూడ. జనం సాక్షి
వ్యవహారిక తెలుగు భాష ఉద్యమ పితామహుడు, అచ్చ తెలుగు చిచ్చర పిడుగు తెలుగు తియ్యదనం అందించిన ఘనుడు గిడుగురామ్మూర్తి అని బంజారా ఉద్యోగుల సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షుడు మాలోతు దశరధ నాయక్ అన్నారు. గిడుగు రామ్మూర్తి 159 వ జయంతి సందర్భంగా స్థానిక అమరవీరుల స్తూపం వద్ద ఆయన చిత్రపటానికి దండ వేసి నివాళులర్పించారు. అచ్చమైన తెలుగును ప్రజలకు అందించే భాషోద్యమానికి పితామహుడు అయ్యాడన్నారు. మాతృభాష ప్రాధాన్యతను వివరించడంతో పాటు పుస్తకాల్లోనూ ప్రచురించి తెలుగుకు వన్నె తెచ్చారన్నారు. కార్యక్రమంలో మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు తాళ్లపల్లి రవి, సామాజికవేత్త రూషికేశ్ రాజు, బీసీ సంఘం పట్టణ అధ్యక్షులు వెంకటేశ్వర్లు, యాదవ సంఘం డివిజన్ ప్రధాన కార్యదర్శి చేగొండి మురళి యాదవ్ ఎం ఐ ఎం జిల్లా కార్యదర్శి ఫారుక్, వెంకటయ్య,రాము, జవహర్ లాల్ సుధాకర్ రాంబాబు శ్రీను తదితరులు పాల్గొన్నారు.