దివ్యాంగుల ప్రత్యేక ప్రజావాణికి 19 దరఖాస్తులు

– జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు.

హన్మకొండ బ్యూరో చీఫ్ 22అక్టోబర్ జనంసాక్షి

జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శనివారం రోజున దివ్యాంగుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమం కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది,
ఈ ప్రజావాణి కార్యక్రమానికి పందొమ్మిది దరఖాస్తులు వచ్చాయని పేర్కొన్నారు,వీటిలో బ్యాటరీ సైకిల్స్ కోసం నాలుగు, వీల్ చైర్స్ కోసం ఐదు, వ్యక్తిగత లోన్ ల కోసం ఏడు,సదరం సర్టిఫికేట్ ల కోసం మూడు దరఖాస్తులు వచ్చాయని తెలియచేసారు
కార్యక్రమంలో ఆర్డీవో ఎం వాసుచంద్ర,
జిల్లా సంక్షేమ అధికారి
ఎం సబిత, మరియు జిల్లా సర్వెలెన్స్ అధికారి డాక్టర్ వాణిశ్రీ, డీవిఏహెచ్వో
డాక్టర్ కే వి నారాయణ , సిడిపివో కే మధురిమ వ్యవసాయ శాఖ అధికారి మాధవి,
ఆర్అండ్బి అధికారి రవీందర్, మెప్మ డీఎంసి రజిత రాణి, అదనపు డీఆర్డీవో రవి,
తదితరులు పాల్గొన్నారు

తాజావార్తలు