దీక్ష నియమాలు పాటిస్తూ హిందూ ధర్మాన్ని కాపాడాలి

అఖిల భారతీయ అయ్యప్ప ధర్మప్రచార సభ

సూర్యాపేట టౌన్ (జనంసాక్షి): అయ్యప్ప స్వామి వారి మాలను స్వీకరించే స్వాములు దీక్ష నియమాలు పాటిస్తూ హిందూ ధర్మాన్ని కాపాడాలని అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ జాతీయ కార్యదర్శి వంకాయలపాటి శంకర్ , రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.భాస్కరాచారి స్వాములు అన్నారు.గురువారం పట్టణంలో ఆ సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి రంగు ముత్యంరాజు అధ్యక్షతన జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు.అఖిల భారతీయ అయ్యప్ప ధర్మప్రచార సభ ఆధ్వర్యంలో ఏరిమెలిలో నిర్మించే అన్నదాన భవన నిర్మణానికి భక్తుల సహకారం అందించాలని కోరారు.జిల్లాలోని అయ్యప్ప స్వామి భక్తులు తమవంతుగా ఆర్థికంగా గాని, వస్తూరూపేణా గాని సహకారం అందించి భవన నిర్మాణం జరిగేలా చూడాలన్నారు.అయ్యప్ప స్వామి భక్తులు దీక్షా నియమాలు పాటిస్తూ స్వామి వారి కృపకు పాత్రులు కావాలని కోరారు.ఈ కార్యక్రమంలో సంఘ జిల్లా సహాయ కార్యదర్శి భూపతి శ్రీనివాస్ , పిఆర్ఓ రాపర్తి మాహేష్ కుమార్ , జిల్లా కమాండెంట్ దగ్గుపాటి ఉపేందర్ , కోశాధికారి మాశెట్టి నరేష్ , మొరిశెట్టి సత్యనారాయణ , రాఘవశెట్టితో పాటు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.