దేవాలయానికి కేటాయించిన భూమిలో అక్రమ ఇండ్ల నిర్మాణం ఆపాలని తాసిల్దార్ కు గ్రామస్తులు ఫిర్యా దు
మోమిన్ పెట్ ఆగస్టు 20 జనం సాక్షి
గ్రామంలో దేవాలయానికి కేటాయించిన భూమిలో అక్రమ ఇండ్ల నిర్మాణం ఆపాలని మోమిన్ పెట్ మండల పరిధిలోని రావులపల్లి గ్రామస్తులు తహసిల్దార్ కు ఫిర్యాదు చేశారు శనివారం రావులపల్లి గ్రామానికి చెందిన నాగేందర్ రెడ్డి గోవర్ధన్ రెడ్డి హనుమంతులు గ్రామంలో దుర్గామాత ఆలయం కు సంబంధించిన సర్వే నంబరు ఒక టీ లో రెండు గుంటల భూమిలో గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు కలిసి 5 ప్లాట్ల ఇండ్ల నిర్మాణం ప్రారంభించారు ఇంటి నిర్మాణానికి సంబంధించిన అధికారుల నుండి ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండానే దౌర్జన్యంగా ఇంటి పనులు ప్రారంభించుకున్నారు గతంలో ఇదే భూమికి సంబంధించి కోర్టులో పిటిషన్ దాఖలు అయింది కోర్టు తీర్పు వెలువడకుండానే అక్రమ ఇండ్ల నిర్మాణాలు చేపట్టారు అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి దుర్గామాత దేవాలయానికి కేటాయించిన భూమిలో అక్రమ ఇండ్ల నిర్మాణాలు ఆపాలని గ్రామస్తులు కోరారు లేనిపక్షంలో జిల్లా కలెక్టర్. కు ఫిర్యాదు చేస్తామని గ్రామస్తులు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పి ధర్మారెడ్డి పి దయాకర్ రెడ్డి బోయిన్ భీచయ్య నారాయణ మల్లప్ప వెంకటేశం తదితరులు పాల్గొన్నారు