దొంగను రిమాండ్
దోమ SI విశ్వజన్.
దోమ సెప్టెంబర్ 24(జనం సాక్షి)
గ్రామాలలో వరుసగా దొంగతనాలకు పాల్పతున్న వ్యక్తిని రిమాండ్ చేసిన సంఘటన దోమ పోలిస్ స్టేషన్లో శనివారం జరిగింది. ఎస్ఐ విశ్వజన్ తెలిపిన వివరాల ప్రకారం దోమ మండల పరిధిలోని బ్రహ్మణపల్లి గ్రామానికి చెందిన నీరటి ప్రసాద్(20) అనే వ్యక్తి గొట్ల చెల్క తండాలలో సీతాబాయ్, లక్ష్మిబాయ్. విస్లావత్ శంకర్ ఇళ్లల్లో ఈ నెల 21వ తేదిన చోరికి పాల్పడ్డారు. వారి వద్ద నుండి రూ. 1,40,000 వేలు, రెండు తులాల బంగారం. 20 తులాల వెండిని అపహరించినట్లు తెలిపారు. బాధితులు. ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా, అతన్ని అదుపులోకి తీసుకోని విచారించగా అతని వద్ద నుండి చోరీకి పాల్పడిన డబ్బులతో పాటు 1.5 బంగారం. 10 తులాల వెండిని రికవరీ చేశామని తెలిపారు.