ప్రభుత్వంపై మండిపడ్డ షర్మిల
హైదరాబాద్,మార్చి 3(జనం సాక్షిb): భూ సమస్యల పరిష్కారానికి ధరణి మంత్రదండమా? అని వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు. సమస్య పరిష్కారమేమో కానీ లేని సమస్యలను సృష్టించారన్నారు. భూమి ఉన్నోళ్లకు లేనట్టు… లేనోళ్లకు ఉన్నట్టు చూపెడుతూ యజమానులకు లేని పంచాయితీ మోపు చేశారన్నారు. భూమి కోసం అధికారుల చుట్టూ తిరగలేక లంచాలు ఇచ్చుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని షర్మిల పేర్కొన్నారు. కాస్తు కాలాన్ని ఎత్తేసి పాత పేర్ల విూద రికార్డులు చూపిస్తున్నారన్నారు. ఆ భూముల కోసం ఏకంగా హత్యలు చేసుకుంటున్నారన్నారు. లోపాలు ఉన్నాయని విూరే ఒప్పుకొన్నారు. వాటిని పరిష్కరిస్తే విూ పనికిమాలిన పని ఈ ధరణి అని తేలిపోతుందని భయపడుతున్నారా? అని షర్మిల ప్రశ్నించారు




