యాదాద్రి,అక్టోబర్17(జనంసాక్షి): రైతులు ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే అమ్ముకోవాలని, దళారును నమ్మి మోసపోవద్దని యాదాద్రి జిల్లా అధికారులు సూచించారు. మద్దతు ధరలను సక్రమంగా చెల్లించేలా ఏర్పాటు చేశామని అన్నారు. కొనుగోళ్లు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. జిల్లాలో 16 మండలాలు ఉండగా మూసీ పరివాహక ప్రాంతాల నుంచే దిగుబడులు అధికంగా ఉంటాయని అంచనావేసి ఆయా ప్రాంతాల్లో కొనుగోళ్లకు ఏర్పాట్లు చేస్తున్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు సంబంధిత మిల్లులకు రవాణాచేసేలా వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోళ్లకు జిల్లా యంత్రాంగం సిద్ధమవుతోందని చెప్పారు. ఈ మేరకు ఏర్పాట్లపై దృష్టి కేంద్రీకరించామని అన్నారు. ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోలుకు సన్నద్ధమయ్యారు. ఇదిలావుంటే ధాన్యం కొనుగోళ్లపై సంబంధిత అధికారులతో సవిూక్షించి వారికి సూచనలు చేశారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా కొనుగోళ్లకు సన్నద్ధంకావాలని ఆదేశించారు.




