Thursday, 5 November 2026

నల్లగొండ మెడికల్‌ కాలేజీకి పాలనా అనుమతులు

హైదరాబాద్‌,మే23( జ‌నం సాక్షి):  నల్లగొండలో ప్రభుత్వ వైద్య కళాశాల, ఆస్పత్రి ఏర్పాటుకు ప్రభుత్వం పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. రూ. 275 కోట్లతో కాలేజీ, ఆస్పత్రి ఏర్పాటుకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నల్లగొండలో మెడికల్‌ కాలేజీ ఏర్పాటుకు సంబంధించి వైద్యారోగ్య శాఖ పంపిన ప్రతిపాదనలపై సీఎం కేసీఆర్‌ నిన్న సంతకం చేసిన సంగతి తెలిసిందే. ఈ కాలేజీకి 150 సీట్లను కేటాయించారు. ఇక నిమ్స్‌లో 399 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం అనుమతిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.
—————-