తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక అని కితాబు
హైదరాబాద్,నవంబర్2(జనంసాక్షి): మాజీ ¬ం మంత్రి నాయిని నర్సింహ రెడ్డి కుటుంబ సభ్యులను రాజ్యసభ ఎంపీ డి.శ్రీనివాస్ సోమవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… నాయిని మృతి చెందడం ఎంతో బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. నాయిని తనకు విద్యార్థి దశ నుండి స్నేహితుడని… తనకంటే వయసులో పెద్దవాడు అయినా కానీ తనను శీనన్న అని ఎంతో ఆప్యాయంగా పిలిచే వారని గుర్తుచేసుకున్నారు. ఆ కాలంలో ఆయన బుల్లెట్పైన వస్తుంటే పులిలా ఉండేవారన్నారు. తెలంగాణకోసం ఎంతో కృషి చేశారని ఎంపీ తెలిపారు. తెలంగాణ రాష్ట్రం సాధించడంలో ముఖ్య పాత్ర పోషించారన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆయనక ఉహించినంత ప్రాధాన్యత ఇవ్వలేదని వ్యాఖ్యానించారు. చివరి దశలో ఆయన అసంతృప్తితో ఉన్నారని తెలిపారు. ఇప్పటికైనా వారి పిల్లలకు గుర్తింపు ఇచ్చి, తగిన ప్రాధాన్యత దొరుకుతుందని కోరుకుంటున్నానని అన్నారు. వారి కుంటుంబ సభ్యు లకు, బంధువులకు ఎంపీ డి.శ్రీనివాస్ సానుభూతిని తెలియజేశారు. గత నెలలో అనారోగ్యంతో నాయినినర్సింహారెడ్డి కన్నుమూశారు. ఆయన మరణించి వారం తిరగ్గ ముందే సతీమణి కూడా అనారోగ్యంతో మరణించారు. ఇరువురి మరణంతో నాయిని కుటుంబంలో విషాదఛాయలు? అలముకున్నాయి.




