నిజాంసాగర్ ప్రాజెక్టులోనికి 1401.62 అడుగులు చేరిన నీరు
జుక్కల్,జూలై26,(జనంసాక్షి),
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం లోని నిజాంసాగర్ ప్రాజెక్టు జలాశంలోనికి వరద నీరు భారీగా వస్తుంది.బుధవారం ఉదయం 10గంటల వరకు ప్రాజెక్టులోనికి 30 వేల350 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరిందని ప్రాజెక్టు ఏఈఈ శివప్రసాద్ తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1405.00 అడుగులు కాగా 1401.62 అడుగుల నీరు నిల్వ ఉందని తెలిపారు.17.802 టీఎంసీలగాను 13.221 టీఎంసీల నీరు నిల్వ ఉందని తెలిపారు.