Thursday, 5 November 2026

నిమ్స్‌ అభివృద్ధికి కృషి చేద్దాం: డైరెక్టర్‌ పిలుపు

హైదరాబాద్‌,ఆగస్ట్‌15(జ‌నం సాక్షి): సిబ్బంది అందరం ఐక్యతతో నిమ్స్‌ ఆసుపత్రి అభివృద్ధికి పాటుపడదామని నిమ్స్‌ సంచాలకులు డా.మనోహర్‌ అన్నారు. పంద్రాగస్టు సందర్భంగా ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. నిమ్స్‌ పాత భవనంలో గల నిమ్స్‌ వ్యవస్థాపకులు నిజాం నవాబ్‌ విూర్‌ ఉస్మాన్‌ అలీ, మహాత్మాగాంధీ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగంగా నిమ్స్‌ అభివృద్ధికి పాటుపడదాం అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డీన్‌ పరంజ్యోతి, ఎగ్జిక్యూటివ్‌ రిజిస్టార్ర్‌ బీరప్ప తదితరులు పాల్గొన్నారు. జలమండలి కార్యాలయంలో ఎండీ దానకిశోర్‌ జాతీయ పతాకాన్ని ఎగరేశారు. ఖైరతాబాద్‌ విశ్వేశ్వరయ్య భవన్‌లో ఐఈఏ(ఇండియన్‌ ఇంజినీరింగ్‌ అసోసియేషన్‌) సత్యనారాయణ జాతీయ జెండాను ఆవిష్కరించారు. పంజాగుట్ట ఏసీపీ విజయ్‌కుమార్‌ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. పంజాగుట్ట ఇన్పెక్టకర్‌ రవీందర్‌ జాతీయ జెండాను ఎగరేశారు.