నిరుపేద మృతుడి కుటుంబానికి చేయూత..

పదిహేను వేల ఆర్థిక సహాయం.
ఊరుకొండ, సెప్టెంబర్ 23 (జనంసాక్షి):
నిరుపేద కుటుంబాలకు ఎప్పుడు ఏ ఆపద వచ్చిన టిఆర్ఎస్ పార్టీ చేయూతనందిస్తుందని ఎంపీటీసీ కలిమిచెర్ల గోపాల్ గుప్తా అన్నారు. శుక్రవారం ఊర్కోండ మండలం రాంరెడ్డిపల్లి గ్రామానికి చెందిన చాకలి బాల్ రామ్(50) అనారోగ్యంతో మృతిచెందడం జరిగింది. ఈ విషయం స్థానిక టిఆర్ఎస్ నాయకుల ద్వారా తెలుసుకున్న స్థానిక శాసన సభ్యులు చర్లకోల లక్ష్మారెడ్డి తన ప్రగాఢ సానుభుతి తెలియజేస్తూ రూ.5000/- మరియు నాగర్ కర్నూల్ జిల్లా కబడ్డీ మరియు కరాటే అసోసియేషన్ చైర్మన్ ముచ్చర్ల జనార్దన్ రెడ్డి రూ.5000/-, ఎంపీటీసీ కలిమిచెర్ల గోపాల్ గుప్తా గారు రూ.3000/- మరియు గ్రామ సర్పంచ్ శివరాణి హరీష్ రూ.2000/- మొత్తము రూ.15000/- ఆర్థిక సహాయం అందజేశారు. కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు బండెల సుజీవన్ రెడ్డి, గోవిందు సుధాకర్, అనంత రాములు, కానుగుల జంగయ్య, కానుగుల మహేష్, కానుగుల శ్రీను, తదితరులు పాల్గొన్నారు