నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలి

సూర్యాపేట టౌన్ (జనంసాక్షి):నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని సూర్యాపేట జిల్లా ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ నాయకులు సిరికొండ అనిల్ కుమార్ , పేరం ముత్తయ్య బొల్లెద్దు వెంకటేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.గురువారం ఉద్యోగ ఉపాధ్యాయుల నూతన పెన్షన్ విధానాన్ని రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరుతూ కలెక్టరేట్ ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెన్షన్ బిక్ష కాదు ఉద్యోగుల హక్కు అని,సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు .2004 సంవత్సరం నుండి నియామకమైన ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో యూఎస్పిసి నాయకులు సోమయ్య , ప్రతాప్, వెంకటయ్య , జానయ్య , యాకయ్య , అశోక్ , వెంకయ్య తదితరులు పాల్గొన్నారు.