అల్వాల్ (జనంసాక్షి) ఆగస్టు 30
అల్వాల్ సర్కిల్ వెంకటాపురం డివిజన్ ఖానాజీ గూడలో ప్రసిద్ధిగాంచిన ప్రపంచంలోనే అత్యంత అరుదైన విశిష్టమైన మరకత శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ఆలయంలో వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని నేటి నుంచి వచ్చే నెల 10వ తేదీ శనివారం వరకు మరకత శ్రీ లక్ష్మీ నవరాత్రి మహోత్సవాలను నిర్వహిస్తున్నట్టు ఆలయ వ్యవస్థాపకులు కార్యనిర్వాహకులు డాక్టర్ మోత్కూరు సత్యనారాయణ శాస్త్రి తెలిపారు.ఈ 11 రోజుల్లో శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారువరుసగా వరసిద్ధిమహాగణపతి వికటలంభోధరగజానన మహోధర ఏకదంత వక్రతుండ విఘ్నరాజ దూమ్రవర్ణ, లక్ష్మీ గణపతి అవతారాలలో దర్శనమిస్తారని ఆయన వెల్లడించారు. ఈ నవరాత్రి మహోత్సవాలలో జరిపే అభిషేక హోమ ఏక వింశతి దివ్య పత్రార్చనలో పాల్గొనే భక్తులకు ఆయురారోగ్య ఐశ్వర్య ఉద్యోగ వ్యవసాయ వ్యాపారాభివృద్ధి కలగడంతో పాటు విద్యా విదేశీయాన వివాహ సంతానఅన్యోన్యదాంపత్యప్రాప్తి లభిస్తాయన్నారు.అదేవిధంగా వినాయక చవితి రోజు వినాయక వ్రత కల్ప విధానంలో మట్టి వినాయకుణ్ణి పూజించి, నిమజ్జనం చేయటం వల్ల సంవత్సరమంతా విఘ్నాలను దూరం చేసుకుని విజయాన్ని పొందుతారన్నారు.భక్తులు ఈ ఉత్సవాల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని మోత్కూరు సత్యనారాయణ కోరారు.




