పండుగగా డాక్టర్ కల్లూరి సంతోష్ పుట్టినరోజు వేడుకలు

శివ్వంపేట అక్టోబర్ 10 జనంసాక్షి : జిల్లా బిసి సంక్షేమ డాక్టర్ అసోసియేషన్ సమన్వయకర్త డాక్టర్ కల్లూరి సంతోష్ జన్మదినోత్సవ వేడుకలు సోమవారం తన అభిమానుల మధ్య పండుగ వాతావరణం లో జరిగాయి. డాక్టర్ సంతోష్ పుట్టినరోజు సందర్భంగా మండల పరిధిలోని ముగ్ధంపూర్ గ్రామ శివారులో ఉన్న బేతాని అనాద ఆశ్రమంలో శివ్వంపేట్  సొషల్ మీడియా అద్యక్షులు పైనం సందీప్, అలాగే సంతోష్ అభిమానులు విద్యార్థులకు, అనాధ బాల బాలికలకు పండ్లు, బ్రెడ్ ప్యాకెట్ పంపిణీ చేశారు. ఆ తర్వాత లయన్స్ క్లబ్ సభ్యులు తూప్రాన్ లోని  మల్టీ డెంటల్ హాస్పిటల్లో డాక్టర్ సంతోశ్ ను శాలువాతో సత్కరించి, కెక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బహదూర్ పల్లి టీఆరెఎస్ నాయకులు సగ్గిడి నర్సింగ్ రావు, డాక్టర్ సంతోష్ అభిమానులు పైనం సందీప్, శేఖర్ రెడ్డి, నరేష్, హరి ప్రసాద్ రెడ్డి,  ధను, అభిలాష్, ఇతర టిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.