పాడి పశువుల అభివృద్దే ప్రభుత్వ లక్ష్యం..
ఉచిత పశు వైద్య శిబిరం…
ఎంపీపీ సరోజన..
శంకరపట్నం జనం సాక్షి సెప్టెంబర్ 7
తెలంగాణలో టిఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ పాడి పశువుల అభివృద్ధి లక్ష్యంగా పశు ఆరోగ్యం కోసం పాడి రైతుల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలు పెట్టి నిధులు విడుదల చేస్తున్నాడని శంకరపట్నం ఎంపీపీ ఉమ్మెoతల సరోజన అన్నారు. బుధవారం శంకరపట్నం మండలంలోని కొత్తగట్టు గ్రామంలో ఉచిత పశు వైద్య శిబిరాన్ని నిర్వహించి, 124 పశువులకు గర్భస్థ పరీక్షలు నిర్వహించి, వైద్య చికిత్సలు నిర్వహించి నట్టల మందు వేసినట్లు పశు వైద్య అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో టి ఎస్ ఎల్ డి ఏ డైరెక్టర్ మాడ వెంకటరెడ్డి, పశు గణనాభివృద్ధి సంస్థ ముఖ్య కార్యనిర్వాహణ అధికారి శ్రీధర్, పశు వైద్యులు మాధవరావు, విజేందర్ రావు, పశు వైద్య సిబ్బంది, ఆరోగ్య మిత్రలు, పాడిరైతులు తదితరులు పాల్గొన్నారు